SAKSHITHA NEWS

మియాపూర్ డివిజన్ పరిధిలోని HMT స్వర్ణపూరి ప్రధాన రహదారి కమాన్ నుండి అబ్దుల్ కలాం విగ్రహం వరకు రూ.75.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చెపడుతున్న సీ సీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC గాంధీ తెలియచేసారు. అదేవిధంగా మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు HMT స్వర్ణపూరి కాలనీ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం చాల సంతోషకరం విషయం అని, HMT స్వర్ణపూరి కాలనీ దశ దిశ ను మార్చామని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని, కాలనీ లో జరుగుతున్న రోడ్డు పనులను స్వయంగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా మియాపూర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హెచ్ఎంటి కాలనీ అధ్యక్షులు దేవేందర్ రావు, అసోషియేషన్ సభ్యులు దశరథ్ రావు, శివరామ రాజు, విరూపాక్షయ్య, రాఘవ రావు, రమేష్ చంద్ర, శ్రీపతి శర్మ, నరేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బాలయ్య, విద్యాసాగర్, మూర్తి, సురేష్, విధ్యానంద చారి, నర్సింగ్ రావు, నాగభూషణం, సత్యం మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app