SAKSHITHA NEWS

కేఏ పాల్ ఎఫెక్ట్: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఈ మేరకు 10 మంది ఎమ్మెల్యలను హైకోర్టు ఆదేశించింది.కాగా, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

పార్టీ మారిన ఎమ్మెల్యేల జీతాలు, వారికి సౌకర్యాలు కట్ చేయాలని కేఏ పాల్ వేసిన పిటిషన్‎పై హైకోర్టు ఇవాళ (సెప్టెంబర్ 23) విచారణ చేపట్టింది.ఈ మేరకు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి.. కౌంటర్ దాఖలు చేశాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‎పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ గూటికీ చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


SAKSHITHA NEWS