SAKSHITHA NEWS

హీరో అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్?

హైదరాబాద్:
మూడు రోజుల క్రితం సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు.

చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 105,118(1) r/w 3(5) కింద కేసు నమోదై నట్టుగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఇలాంటి ఘటన మరే థియేటర్ వద్ద జరగకూడ దని పోలీసులు అల్లు అర్జున్ ను ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోం ది.

బన్నీ మరే థియేటర్ వద్దకు వెళ్లినా.. జనాలు పోగు అవుతారని.. అదే సమయంలో తోపులాట జరిగే ప్రమాదం ఉందని భావించి పోలీసులు అల్లు అర్జున్ ను హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియవలసింది.


SAKSHITHA NEWS