HELMET నందివాడ మండలం
లక్ష్మీ నరసింహ పురం జిల్లా పరిషత్ విద్యార్థిని విద్యార్థులకు హెల్మెట్ అవగాహన సదస్సు::ఎస్.ఐ ఎన్.చంటి బాబు
ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధారణ తప్పనిసరి
రహదారులపై రోడ్ ప్రమాదం అనేది ఊహించనిది
యువత హెయిర్ స్టైల్ చెరిగిపోతుందని హెల్మెట్ పెట్టకపోతే జీవితం చిరిగిపోతుంది
ఓ వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తి యొక్క కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది
విద్యార్థులు హెల్మెట్ పై అవగాహనాలు చేసుకొని ఇంటి వద్ద పెద్దలకు,ఇరుగుపొరుగు లకు చెప్పాలి
విద్యార్థులు పుస్తకాలు పాఠాలు మాత్రమే కాకుండా బయట విషయాలు మీద అవగాహన కలిగి సామాజిక స్పృహ కలిగి ఉండాలి
నందివాడ మండలం లక్ష్మీపురం గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో నందివాడ ఎస్.ఐ ఎన్. చంటి బాబు విద్యార్థులకు హెల్మెట్ హెల్మెట్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ చంటి బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలతో రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చు, హెల్మెట్ ధారణ వల్ల ప్రమాదం నుండి 80% తపించుకోవచ్చని బారి వాహనాలను ఢీకొన్న లేదా రోడ్కి ఢీకున్న తలభాగం చాలా సున్నితమైనది గాయాలు కాకుండా కాపాడుతుందని అన్నారు .. మానవ శరీరంలో తలభాగం అత్యంత ముఖ్యమని తల భాగంలో మెదడుకు ఏ చిన్నపాటి గాయమైన ప్రాణం పోవచ్చు లేదా మనిషి దీర్ఘకాల అపస్మారక స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది.. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడం వల్ల ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే నష్టపోరని ఓ వ్యక్తి ప్రాణం అంటే కుటుంబమని అన్నారు. హెల్మెట్ ధారణ భారంగా అనుకుంటే ప్రమాదం జరిగాక ఎంత బాధ పడిన ప్రయోజనం ఉండదని ముందు మేల్కొని హెల్మెట్ ను ఉపయోగించడం వల్ల భద్రత ఉంటుందని అన్నారు ..విద్యార్థులు రేపటి భవిష్యత్తు దీపాలు లాంటి వారు మీరు దీనిపై పూర్తి అవగాహనాలు చేసుకొని ఇరుగుపొరుగు వారికి తెలియజేయాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన అన్నారు. 18 సంవత్సరాలు నిండకుండా ఏ ఒక్కరు ద్విచక్ర వాహనాలు నడపరాదని అలా నడపడం శిక్షారమని, మైనర్ విద్యార్థులకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.హెల్మెట్ లేకుండా రోడ్లపై ప్రయాణం చేస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధించి ఇలాంటి సందర్భాల్లో మరికొన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు