కృష్ణా జిల్లా.
అవనిగడ్డ నియోజకవర్గం
భారీ వర్షాలుకురైతులకు తీవ్రర నష్టం ..
రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..
ముంపు గురైన పంట పొలాలను పరిశీలించిన ,
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.
వైసీపీ రైతు విభాగం నాయకులు కడవకల్లు నరసింహారావు..
అవనిగడ్డనియోజకవర్గంలోఆరు మండలాల్లోని భారీ వర్షాలకు వరి పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిన రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు..
నాగాయలంక మండలం లోని చోడవరం గ్రామంలో వైసీపీ నాయకులు, రైతులతో కలిసి ముంపు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు..
అనంతరం మాజీఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ
ఈభారీ వర్షాల ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందజేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు..
వైసిపి రైతువిభాగం నాయకులు కడవకోల్లునరసింహారావు మాట్లాడుతూ భారీ వర్షాలకు రైతాంగం పూర్తిగా నష్టపోయి,రైతులు కుదేలయ్యారని ఆయన అన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎకరాకు 20000రూపాయలు నష్టపరిహారం అందజేయాలని కోరారు …రైతాంగానికి ఎటువంటి నష్టం వాటిల్నా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డివెంటనే నష్టపరిహార అందజేయడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ పరిశీలనలో స్థానిక రైతులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు