SAKSHITHA NEWS

జూరాలకు భారీగా వరదనీరు

హైదరాబాద్:
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతుంది నిన్న సాయంత్రం 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండ గా… రాత్రి 9 గంటలకు లక్ష క్యూసెక్కులకు తగ్గింది.

ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ప్రాజెక్టు నుంచి 34 వేల 179 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

గేట్ల ద్వారా 81 వేల 980 నీటిని విడుదల చేస్తు న్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామ ర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.850 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఎగువన ఉన్న ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 127.83 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 58 వేల 595 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..

ప్రాజెక్టు నుంచి 60 వేల 620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగు తోంది. ప్రాజెక్టుకు 84 వేల 646 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

దీంతో ప్రాజెక్టు 18 క్రస్టు గేట్లను ఎత్తి 88 వేల 811 క్యూసెక్కుల నీటిని దిగు వకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


SAKSHITHA NEWS