
నిరంతర ఉచిత వైద్య శిబిరాల తో ప్రజలకు ఆరోగ్యం పై భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్స్ లో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులకు ఉప కరణాల గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దివ్యాంగులు ఈ గుర్తింపు శిబిరానికి తరలివచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు పేరు నమోదు చేసుకుని వారికి కావలసిన వివిధ రకాల ఉపకరణాలను త్వరలో మంజూరు చేయమన్నారు. ఎంపికైన వారికి ఓ నెలలో ఉచితంగా ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్, చేతి కర్రలు, సంక కర్రలు తదితర ఉపకరణాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారిని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి స్వయంగా మాట్లాడి భరోసా కల్పించారు. అత్యవసరంగా అర్హులైన ఐదు మందికి ఉచితంగా వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సహాయ సంస్థ మేనేజర్ జి అర్చన, సిబ్బంది, మానవతా సంస్థ సోమిశెట్టి శ్రీనివాసులు, ఏ ఎల్ ఐ ఎం సి ఓ ప్రతినిధులు, షేక్ జంషెర్ అహ్మద్, దొరసాని, రెహమాన్, కరీముల్లా, తులసి, పార్వతి, అమ్ములు కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app