ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు : హరీశ్‌రావు.!!
Harish Rao | హైదరాబాద్ : ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.
ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం కింద తీసుకున్న అప్పులు రూ. 51 వేల 277 కోట్లు. ఉదయం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు కూడా తీసుకున్నాను. ఈ రోజుకు కలిపితే ఇంకో రూ. 3 వేల కోట్లు పెరిగింది. అంటే ఎఫ్ఆర్‌బీఎం కింద రూ. 55, 277 కోట్లు తీసుకున్నట్లు రిపోర్టు ఉంది. కార్పొరేషన్ గ్యారెంటీల కింద రూ. 61,991 కోట్లు, మరో రూ. 10,099 కోట్లు గ్యారెంటీలు లేకుండా తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు ఎంతంటే రూ. 1,27,208 కోట్లు.. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని హరీశ్‌రావు తెలిపారు.