హర్ ఘర్ తిరంగా.. భారతదేశ కీర్తిప్రతిష్ఠలు.. శక్తిసామర్థ్యాలకు ప్రతీక : ప్రత్తిపాటి
- చిలకలూరిపేట పట్టణ వీధుల్లో కోలాహాలంగా సాగిన తిరంగా ర్యాలీ
- యువతతో కలిసి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి
- బలమైన నాయకత్వంతోనే దేశమైనా.. రాష్ట్రమైనా సుస్థిర ప్రగతి సాధించగలవు : ప్రత్తిపాటి.
- ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిభాసామర్థ్యాలు, నాయకత్వ పటిమే అందుకు నిదర్శనం : ప్రత్తిపాటి
బలమైన, సమర్థవంతమైన నాయకత్వంతోనే దేశమైనా…రాష్ట్రమైనా సుస్థిరప్రగతిని సాధించగలవని, అందుకు ప్రబల నిదర్శనం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల సమర్థవంత పాలన, నాయకత్వపటిమేనని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిలకలూరిపేట పట్టణ వీధుల్లో 350 అడుగుల భారీ జాతీయ జెండాతో యువత జయజయ ధ్వానాలతో కోలాహాలంగా సాగిన తిరంగా ర్యాలీని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు.
భారత్ సహకారం లేకుండా ఏ దేశం మనుగడ సాగించలేదు
దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పిలుపుమేరకు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రతి భారతీయుడు గర్వించే కార్యక్రమమని, దేశ కీర్తిప్రతిష్ఠలు…శక్తిసామర్థ్యాలకు ఇది గొప్ప ప్రతీకని ప్రత్తిపాటి చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వమైన భారతజాతి మొత్తం మోదీ నాయకత్వంలో ఒకే మాటపై నిలిచి ఉందని, దేశం మనకేం చేసిందని కాకుండా.. ప్రతి ఒక్కరూ తాము దేశానికి ఏంచేశామో గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని ప్రత్తిపాటి సూచించారు.
ప్రధాని నాయకత్వంలో భారత్ ఇతర దేశాల ఆర్థికాభివృద్ధిని అధిగమిస్తూ దూసుకుపోవడం భారతీయులు గర్వించాల్సిన విషయమని ప్రత్తిపాటిచెప్పారు. 2028 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో కచ్చితంగా మూడోస్థానానికి చేరుతుందన్న ప్రత్తిపాటి..భారత్ సహకారం లేకుండా ఏ దేశమూ మనుగడ సాగించలేదని తేల్చిచెప్పారు. పొరుగుదేశాలు ఎంతగా కవ్విస్తున్నా.. మోదీ నాయకత్వంలోని భారతావని సంయమనం.. సహనంతో వ్యవహరిస్తోందన్నారు.
నాయకత్వం బలంగా ఉంటేనే.. దేశం, రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి
నాయకత్వం ఎంత బలంగా ఉంటే .. దేశమైనా, రాష్ట్రమైనా అంత త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి అనడానికి మోదీ, చంద్రబాబు నాయకత్వాలే ఉదాహరణని ప్రత్తిపాటి తెలిపారు. గత పాలకుల విధ్వంసంతో సర్వంకోల్పోయిన రాష్ట్రాన్ని తిరిగి ప్రగతిబాట పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అటు కేంద్రంతో, ఇటు ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతమవ్వడం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమన్న ప్రత్తిపాటి, పరిశ్రమలు.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. ఏడాది పాలనలోనే ప్రపంచప్రఖ్యాత కంపెనీలు..సంస్థలు రాష్ట్రంవైపు చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న విధానాలతో ముందుకు సాగుతున్నారన్నారు. చంద్రబాబు ముందుచూపు, పనితీరు, ఆలోచనావిధానమే రాష్ట్రానికి ఒక మంచి దశదిశను చూపుతుందన్న ప్రత్తిపాటి, తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే ప్రజలందరూ ముక్తకంఠంతో చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టాలని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు.
జగన్ దుర్మార్గపాలనలో ఎంత నష్టపోయారో ప్రజలు ప్రతిక్షణం ఆలోచించాలన్నారు.
తిరంగా ర్యాలీలో యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్తిపాటి.. భారత్ మాతా కీ జై.. మేరా భారత్ మహాన్ .. నినాదాలతో ప్రజలను ఉత్తేజపరిచారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక, కార్యదర్శులు పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బీజేపీ నాయకులు జయరామి రెడ్డి, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జిలు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, కొత్త కోటేశ్వరరావు, వివిధ హోదాలలో నాయకులు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ సిఐ రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
