టీటీడీకి రూ.1.10 కోట్లు విరాళం
సాక్షిత ప్రతినిధి – తిరుమల: హైదరాబాద్ కు చెందిన కాప్స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. దాతలకు టీటీడీ అదనపు ఈవో కృతజ్ఞతలు చెప్పి అభినందనలు తెలిపారు.
