జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన
అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ B.M.సంతోష్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు తదనంతరం
అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఆధ్వర్యంలో
దేవబండ గ్రామ ప్రజలు అయిజ మండలం లోని దేవబండ గ్రామాన్ని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దేవబండ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొత్త గ్రామ పంచాయతీ గా ఏర్పాటు యెందుకు చర్యలు తీసుకోవాలని తమరిని సవినయంగా దేవబండ గ్రామ ప్రజలు కోరుచున్నాము.
అయిజ మండల పరిధిలోని 16 ఎంపీటీసీల స్థానాల సంఖ్యను 22 ఎంపీటీసీ స్థానాలకు పెంచాలని వినతి
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ కి అయిజ మండలం లోని ప్రస్తుతం 16 ఎంపీటీసీ ల సంఖ్యను 22 ఎంపీటీసీ స్థానాలకు కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం 3000 ఓట్ల కంటే పైచిలుకు ఎంపీటీసీ స్థానాన్ని రెండుగా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.మూడు వేల ఓట్ల పైచిలుకు ఓట్లున్న తూంకుంట, ఉత్తనూరు,తోతినోని దొడ్డి,సింధనూర్,పులికల్, చిన్న తాండ్రపాడు పరిధిలోని గ్రామాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు మరో ఆరు ఎంపీటీసీ స్థానాలు పెంచేందుకు అవకాశం ఉంది ఈ విషయాన్ని తమరు పరిశీలించి ఐయిజ మండలం లో మరో 6 ఎంపీటీసీ స్థానాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపగలరని తమరిని సవినయంగా కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో దేవబండ గ్రామ మాజీ ఉప సర్పంచ్ జయన్న,పరమేష్ గౌడ్, నౌరోజి క్యాంప్ మాజీ సర్పంచ్ భద్రయ్య,బింగి దొడ్డి మాజీ ఎంపీటీసీ చిన్న రాముడు, తూంకుంట కే,కె, లాయర్ రాజు,దేవబండ గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.