
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘‘తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ తపన ఎంతో హర్షణీయం. మీ ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ లోకేశ్’’ అని పోస్ట్ పెట్టారు.
