
కూటమి ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ ప్రక్షాళన: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
చివరి ఎకరాకు కూడా నీరు అందేలా… సాగునీటి సంఘాలు పనిచేయాలి: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
నీటి సంఘాల ప్రతినిధులలు, అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న… ఎమ్మెల్యేలు రాము,కృష్ణ ప్రసాద్
సాగునీటి వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలందరం కలిసి పనిచేస్తున్నాం: గుడివాడ ఎమ్మెల్యే రాము
గుడ్లవల్లేరు జనవరి 22: ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని… ఆ దిశగా రైతులకు మేలు చేకూర్చే సాగునీటి సంఘాలను ప్రవేశపెట్టామని ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా…. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
మండల కేంద్రమైన గుడ్లవల్లేరు ఇరిగేషన్ బంగ్లాలో… కౌతవరం డివిజన్ ,కౌతవరం సెక్షన్ల పరిధిలోని డీసీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో మధ్యాహ్నం నిర్వహించిన సమీక్షా సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న డిసి చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు ఇరిగేషన్ కాలువలపై జంగిల్ క్లియరెన్స్, డీసిల్ట్, ఇతర సమస్యలను.. ఎమ్మెల్యేలు మరియు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
సమావేశంలో లేవనెత్తిన సమస్యలపై… అధికారులతో ఎమ్మెల్యేలు మాట్లాడారు… గత ప్రభుత్వం మాదిరి కాకుండా… రైతాంగ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ ఎమ్మెల్యేలు రాము, కృష్ణ ప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో ఇరిగేషన్ వర్కులు…. 100 శాతం కచ్చితత్వంగా జరిగేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే… సాగునీటి సంఘాలను ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం,రైతాంగ శ్రేయస్సుకు మంచి వ్యవస్థ ప్రవేశపెట్టిందన్నారు.2022 వరదల్లో రైతుల ఇబ్బందులు గుర్తించి… గ్రామాల్లో పర్యటించినప్పుడు రైతాంగ కష్టాలు చూసి హృదయం తరుక్కుపోయిందని నాటి రోజులను ఎమ్మెల్యే రాము గుర్తు చేసుకున్నారు.
ఇరిగేషన్ వర్కులు నామమాత్రంగా చేసి వైకాపా ప్రభుత్వం దోపిడీకే ప్రాధాన్యత ఇవ్వడంతో, రైతాంగానికి ఏర్పడిన హృదయ విధారకర దృశ్యాలు మళ్లీ పునరావృత్తం కాకూడదనీ…సమర్థులైన వ్యక్తులను నీటి సంఘాల అధ్యక్షులుగా గెలిపించినట్లు తెలియజేశారు.
డబ్బులు సంపాదించుకునే వ్యవస్థలుగా మార్చిన సాగునీటి కాలువలను…. రైతులకు అండగా నిలిచే వ్యవస్థగా కూటమి ప్రభుత్వం మారుస్తుందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘటించారు.
పెడన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా, నేను ముగ్గురం కలిసి రైతుల ప్రయోజనాలకె ప్రాధాన్యత నిస్తున్నామని…. సాగునీటి వ్యవస్థలో సమస్యలు తలెత్తితే తమ ముగ్గురులో ఎవరి దృష్టికి తీసుకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.
సాగునీటి సంఘాలన్నీ సమన్వయంతో పనిచేస్తూ చివరి ఎకరాకు కూడా నీరు అందేలా కృషి చేయాలన్నారు. రైతులపై ఉన్న చిత్తశుద్ధితో సీజన్ కు ముందే సమావేశాలు నిర్వహించి…. కాలువలను ప్రక్షాళన చేస్తున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు.
పెడన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… గత ఐదేళ్లలో దోపిడీకే వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో… కాలువల నిర్వహణ సరిగ్గా లేక అద్వాన్న స్థితికి చేరాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు పూర్తిగా మారాయని, రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రైతాంగ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా తామంతా సమన్వయంతో పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాబోవు సీజన్ కు సమస్యలు లేకుండా సాగునీటి కాలువ ద్వారా నీరు అందుతుందని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మిల్క్ డైరెక్టర్ అజ్జా నగేష్,….ఇరిగేషన్ EE K. బాబు, మచిలీపట్నం DE కిరణ్ బాబు, డ్రైనేజ్ DE కుమార్, కౌతవరం DE శ్రీను, ఏఈలు నిర్మల, రామ్ తులసి,నాగేశ్వరరావు….గుడివాడ, పెడన నియోజకవర్గాల పరిధిలోని డిసి చైర్మన్లు మల్లిపెద్ది సుబ్రహ్మణ్య, ఆంజనేయులు, నల్లమోతు చంద్రమోహన్రావు,బొర్ర కాశి, వెంకటలక్ష్మి నరసింహస్వామి… నీటి సంఘాల అధ్యక్షులు ,మరియు పెడన,గుడివాడ నియోజకవర్గాల కూటమి నాయకులు దేశపతి,శ్రీ రామమూర్తి,పరస వెంకటేశ్వరరావు, పరస పోతురాజు,భద్రాచలం,వాక శ్రీనివాసరావు,జి.శ్రీరామ మూర్తి,శ్రీదర్,చంటి,బొప్పన సుభాష్ చంద్రబోస్,కృష్ణబాబు ,వీరమాచినేని శివప్రసాద్, వీరమాచినేని జయరాం, చిట్టి బొమ్మ నరసింహారావు, పామర్తి పోతురాజు, కానూరి సత్యబాబు, సురపనేని ప్రసాద్, బుర్ర నాగేశ్వరరావు, బుర్ర మల్లికార్జునరావు, పామర్తి కన్య భాస్కరరావు, బొర్రా మల్లేశ్వరరావు, బొప్పన బోస్, చలపాటి ప్రసాద్,పంచకర్ల సురేష్, పేర్ని జగన్, నల్లమోతు రఘురాం, సాయన శ్రీనివాసరావు, సూరిశెట్టి రాజబాబు, అరసమిల్లి శివ రాజేష్, అట్లూరి స్వరూప్, గోడ శివ, పలువురు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
