జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
ఆది, సోమవారాల్లో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు ఒక l ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని, పరీక్షల నిర్వహణ కొరకు 25 పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు 144 సెక్షన్ తొ పాటు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 8722 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, మొదటి రోజు ఆదివారం రెండు సెషన్లలో పరీక్షకు 49.48 శాతం మంది హాజరయ్యారు. ఇక రెండవ రోజు సోమవారం రెండు సెషన్లలో 48.06 శాతంమంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
…………………………………………………….
జారీ చేయువారు:- డి పి ఆర్ ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా.