ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు…. ఐఎంఏ నాయకుల శుభాకాంక్షలు

ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు…. ఐఎంఏ నాయకుల శుభాకాంక్షలు

SAKSHITHA NEWS

Greetings from IMA leaders to MLA Venigandla Ram

ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు…. ఐఎంఏ నాయకుల శుభాకాంక్షలు….. నోట్ పుస్తకాలు అందజేసి అభినందించిన వైద్యులు

గుడివాడలో వైద్యరంగ అభివృద్ధికి…. ప్రైవేటు వైద్యులు తమ వంతు సహకారం అందించాలి: ఎమ్మెల్యే రాము

గుడివాడ19: సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెద్దలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఎంఈ అధ్యక్షుడు డాక్టర్ పాలడుగు వెంకట్రావు, ఉపాధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్, నాయకులు డాక్టర్ కొనుకొల్లు శ్రీనివాస్, డాక్టర్ ఉండవల్లి సురేష్ కుమార్…. రాముకు నోటు పుస్తకాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఐఎంఏ పెద్దలతో ఎమ్మెల్యే రాము కొద్దిసేపు ముచ్చటించారు. గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైద్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా గుడివాడలో వైద్య రంగా అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే రాము ఐఎంఏ నాయకులకు సూచించారు. అనంతరం ఈనెల 22వ తేదీన ప్రారంభించే ‘సపోర్టింగ్ స్కాలర్స్’ సంస్థ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా డాక్టర్ పొట్లూరి వంశీ ఎమ్మెల్యే రాముకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చూపే 9,10 తరగతులకు చెందిన మొదటి పదిమంది విద్యార్థులకు ‘సపోర్టింగ్ స్కాలర్స్’ సంస్థ ద్వారా స్కాలర్షిప్ లను అందించడమే కాక….. ఉపాధ్యాయులకు ద్రోణాచార్య అవార్డులను కూడా అందజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి తమ సంస్థ ద్వారా కృషి చేస్తామని పొట్లూరు వంశీ ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు. మంచి లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సపోర్టింగ్ స్కాలర్స్ సంస్థ ద్వారా పదిమందికి మంచి చేస్తూ…… మంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ…. సంస్థను ఏర్పాటు చేసిన డాక్టర్ పొట్లూరి వంశీని ఎమ్మెల్యే రాము అభినందించారు.

WhatsApp Image 2024 06 19 at 11.07.21

SAKSHITHA NEWS