ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధికి శ్రీధర్ బాబు సేవలు అమూల్యం….
–ఎమ్మెల్యే విజయరమణ రావు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:సుల్తానాబాద్,
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు మంత్రిగా సేవలందిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు.
ప్రస్తుతం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ తెలంగాణ అభివృద్ధికి, యువత ఉపాధి అవకాశాల కల్పనకు విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో శ్రీధర్ బాబు పాత్ర కీలకమని అన్నారు.
ప్రజా సేవలో మరింత ముందుకు సాగుతూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. దామోదర్ రావు, డీసీసీ కార్యదర్శి మోబిన్, సాయిరి మహేందర్, పన్నాల రాములు, డి. శ్రీనివాసరావు, పల్లా సురేష్, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
