సరూర్‌నగర్ స్టేడియాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ నేతలు…

Sakshitha news

సరూర్‌నగర్ స్టేడియాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ నేతలు…

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల ను అమలు చేయాలని జూలై 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో “ఛలో సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సు”

ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్..

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ “యూత్ డిక్లరేషన్” పేరిట యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం…

విద్యార్థులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 18న సరూర్‌నగర్ వేదికగా నిర్వహించనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు స్థలాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు MLC శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి ,కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి , నోముల భగత్,బంటి,అవినాష్ రెడ్డి , ముఠా జై సింహా, BRSV అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్,బాలరాజు యాదవ్,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్,మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు విద్యాసాగర్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్,ధర్మేందర్ రెడ్డి , తుంగబాలు,కాడరి స్వామి యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు..

Scroll to Top