గంగా నగర్‌లో నూతన పాఠశాల ప్రారంభం.. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
గోదావరిఖని, : గోదావరిఖని గంగా నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓక్లీ విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించి పాఠశాలను ప్రారంభించారు.
అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా సదుపాయాలు, మౌలిక వసతుల గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి విద్యే మూలాధారమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి భావితరాలను తీర్చిదిద్దడంలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణతో పాటు ఆధునిక విద్యను పెంపొందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందన్నారు.
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని⁸ పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆకాంక్షించారు. విద్య ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా తోడ్పడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
