ప్రభుత్వ నిర్ణయ ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి
నూతనకల్లు మండలం ఐకెపి కేంద్రంలో తేమ శాతం చూస్తున్న ఏఈవో సాయిప్రసాద్
ఐకెపి కేంద్రాలలో ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు సన్నధాన్యం 14 దొడ్డు ధాన్యం 17 తేమ శాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని ఏఈవో సాయి ప్రసాద్ అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం తాళ్ల సింగారం గ్రామంలో గల ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన తేమ శాతం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరబెట్టకుండా ధాన్యాన్ని కాంటాలు వేస్తే రైతులు సమస్యలు ఇబ్బందులు పడతారని గుర్తు చేశారు.ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని కచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం తేమ శాతం రావాల్సిందే అన్నారు.ఆయన వెంట ఐకెపి నిర్వాహకులు ఉమామహేశ్వరి కమిటీ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు