
షాపూర్ నగర్ లోని క్రియేటివ్ హైస్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
షాపూర్ నగర్ లోని సంజయ్ గాంధీ నగర్ లో ఉన్న క్రియేటివ్ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథి గా డాక్టర్ రమ్య కీర్తి,క్రియేటివ్ హైస్కూల్ కరస్పాండెంట్ షబ్బీర్, లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా డాక్టర్ రమ్య కీర్తి మాట్లాడుతూ క్రియేటివ్ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించడం ఎంతో అభినందనియమని అన్నారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల వల్ల విద్యార్థులు తమ ప్రతిభను వెలికి తియడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. చిన్నారుల ప్రతిభకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిదర్శనమని అన్నారు. ఈ సందర్బంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అకట్టుకున్నాయి. చిన్నారుల అట పాటలు అలరించాయి. గ్రాడ్యుయేషన్ డే వేడుకలలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
