SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ పర్యటన ఉన్నందున అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు జిల్లా లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను పిపిటి ద్వారా గవర్నర్కు వివరించాలని కలెక్టర్ తెలిపారు గవర్నర్ తిలకించుటకు ఐదు స్టాళ్లను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని ఆ తరువాత శాఖల వారీగా తమ లక్ష్యాలను గవర్నర్ కు వివరించాల్సి ఉంటుందని అందరి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

జిల్లాకు చెందిన వివిధ కళాకారులు,కవులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని దానికి తగ్గ ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వి అప్పారావు డిఇఓ అశోక్ భీమన్నచో కోటాచలం సివిల్ సప్లై అధికారి డి రాజేశ్వర్ కలెక్టరేదేవో సుదర్శన్ రెడ్డి డిపిఓ నారాయణరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ లేబర్ జి నారాయణస్వామి డిడబ్ల్యువో కె నరసింహారావు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లత డి జి డి వో శంకర్ ఈ పంచాయతీ రాజ్ కే మాధవి మిషన్ భగీరథ అధికారులు శ్రీనివాస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS