SAKSHITHA NEWS

ప్రభుత్వంసమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో కలెక్టర్కు………… ఎస్ఎఫ్ఐ వినతి

సాక్షిత వనపర్తి
గత 28 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని నిర్వహించిన ప్రజావాణిలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ని కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం ఆది మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ‌ వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో కేజీబివి పాఠశాలలో ‌ సిబ్బంది లేక పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. విద్యారంగంలో ఎంతో గొప్ప సేవలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకపోతే అధికారుల పని ప్రభుత్వ పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంటుందని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టడంతో ‌ విద్యావ్యవస్థ కుంటుపడుతుందని అన్నారు.

గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ రేషన్ చేస్తామని చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గుర్తుకు లేవ అని ప్రశ్నించారు. తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర నాయకులతో కలిసి ప్రభుత్వం చర్యలు సఫలంగా జరిపి వారిని విధుల్లోకి చేరే విధంగా ప్రభుత్వ చోరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.పంథాలకు పట్టింపులకు పోయి సమ్మె నిర్విర్యం చేస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలసి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు గత 28 రోజులుగా సమ్మెకు దిగుతామని పోవడంతో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థుల చదువు కుంటుబడిందని ప్రస్తుతం పరీక్షల సమయం విద్యార్థులకు రివిజన్ చేయాల్సిన సందర్భంలో ప్రాక్టికల్స్ షెడ్యూలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారితో చర్చలు జరపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని అన్నారు.సమగ్ర శిక్ష ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఎంఈఓ లను ఇన్చార్జి ఎస్ఓలను నియమించి సమగ్ర శిక్ష ఉద్యోగులను భయభ్రాంతులకు చేస్తే విద్యార్థుల చదువులు ముందుకు సాగెది ఎలా పంతాలకు పట్టింపులకు పోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రం లో విద్యార్థుల సంఖ్య డ్రాప్ అవుట్ తగ్గడానికి ప్రధానమైన కారణం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సిబ్బంది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్పిలు టిఆర్టి లు అందుబాటులో లేకపోవడంతో విద్యా వ్యవస్థ ఫైలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందని అన్నారు. తక్షణమే వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించి విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలకు కార్యచరణ ప్రకటించవలసి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవ జిల్లా కమిటీ సభ్యులు మొగిలి,భరత్,చందు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS