SAKSHITHA NEWS

కానిపర్తి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన ప్రభుత్వ డాక్టర్లు

సాక్షిత కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరధిలోని కానిపర్తి గ్రామంలో డి ఎం & హెచ్ ఓ డాక్టర్ లతా దేవి ఆదేశాల మేరకు ప్రస్తుత సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని కమలాపూర్ పిహెచ్ఎస్ పరిధిలో ని కనిపర్తి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

కానీపర్తి పల్లె దావకాన డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా దోమకాటు వలన వచ్చే రోగాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు అలాగే డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తూ ఆయిల్ బాల్స్ డెమో పాస్ స్ప్రే ఫాగింగ్ చేస్తూ వర్షం నీరు నిలవకుండా ఆంటీ లార్వా దోమల నివారణకై తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 74 మంది ప్రజలకు పరీక్షించి వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేసామని , అందులో 12 మందికి వైరల్ ఫీవర్ ఉన్నట్లుగా గుర్తించి వారికి చికెన్ గున్య డెంగ్యూ టెస్టులు నిర్వహించగా అది నార్మల్ ఫీవరగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిపర్తి పల్లె డాక్టర్ అరుణ్ కుమార్ హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్ రాము ఏఎన్ఎం లావణ్య ఆశా కార్యకర్తలు రజిత కావ్య రాణి సంధ్య కోమల మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS