ఆదరించండి అభివృద్ధి చూపిస్తా: గోపులారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తంగడిపల్లి రవీందర్ రెడ్డి
శంకర్‌పల్లి: గోపులారం గ్రామ పంచాయతీ సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరించి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి తంగడి పల్లి రవీందర్ రెడ్డి అన్నారు. తాజా మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని రవీందర్ రెడ్డి తెలిపారు. ఆయన మద్దతు దారులతో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలను పరిష్కరిస్తానన్నారు ప్రజల కోసం పనిచేసే నాయకులనే ఎన్నుకోవాలన్నారు.
ప్రజలందరూ ఆదరించి గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఆయన పేర్కొన్నారు. గెలిపిస్తే అభివృద్ధికి పాటు పడతానన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజల మనిషిగా వస్తున్నానని ఆశీర్వదించాలని కోరారు. గ్రామ అభివృద్ధి ప్రజాసేవి లక్ష్యంగా మీలో ఒకడిగా ముందుకు వస్తున్న.. ఫుట్ బాల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలను కలుస్తూ ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మీలో ఒకడిగా నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, గ్రామస్తుల ముందు హామీ ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
