గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట : ఈనెల 14వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించనున్నందున ఎన్నికల నిబంధనల మేరకు 2వ విడత ఎన్నికలు జరగనున్న అక్బర్పేట్ భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్ మరియు తొగుట మండలాలలోని గ్రామాలలో నేడు సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉన్నదని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత మండలాల పరిధిలోని గ్రామాలలో నేడు సాయంత్రం 5:00 గంటల తర్వాత ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్నికల నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
అలాగే ఎన్నికల నిబంధనల మేరకు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న జిల్లాలోని 10 మండలాల గ్రామాల పరిధిలోగల మద్యం దుకాణాలను కూడా నేడు సాయంత్రం 5:00 గంటల నుండి 14వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్య వరకు మూసివేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో ఆదేశించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
