అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: శేరిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మైలారం గంగాభవాని సత్యనారాయణ
శంకర్‌పల్లి: అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని శేరిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మైలారం గంగాభవాని సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజా మాజీ సర్పంచ్ తన భర్త సత్యనారాయణతో కలిసి గంగాభవాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఎంతో కృషి చేశారని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నానని, ప్రజలు ఆదరించి గెలిపించాలని ఆమె కోరారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామ అభివృద్ధికి కృషి చేసే నాయకులను గుర్తించి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
అవకాశం ఇచ్చి సర్పంచిగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు. తన సతీమణి గంగాభవాని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మాజీ సర్పంచ్ సత్యనారాయణ కోరారు. గ్రామంలో చేసిన అభివృద్ధి సేవ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పథకాలు చేరేలా కృషి చేస్తానన్నారు. ఇంటింటికి తిరుగుతూ గంగాభవానికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ సత్యనారాయణ కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
