ఏపీలో పెన్షన్ అర్హులకు శుభవార్త
ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు: మంత్రి కొండపల్లి
ఏపీలో ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.ఆ తర్వాత 6 నెలలకోసారి అర్హతను బట్టి కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు.
భర్త చనిపోయినవారికి డెత్ సర్టిఫికెట్ సమర్పించిన మరుసటి నెల నుంచే పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానం డిసెంబర్ నుంచే అమలు చేయాలన్నారు.