SAKSHITHA NEWS

అయ్యప్ప భక్తులకు శుభవార్త

విమానాల్లో కొబ్బరికాయలు పట్టుకెళ్లొచ్చు

శబరిమల అయ్యప్పస్వామి భక్తులు విమానాల్లో కొబ్బరికాయలను పట్టుకెళ్లవచ్చని అధికారులు వెల్లడించారు. బ్యూరో ఆఫ్
సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఈ మేరకు అనుమతి ఇచ్చింది. వచ్చే జనవరి 20 వరకు భక్తులు తమ క్యాబిన్ బ్యాగేజీల్లో కొబ్బరికాయలను పట్టుకెళ్లవచ్చునని తెలిపింది. భక్తుల కోసం పరిమిత
కాలంపాటు అనుమతి ఇచ్చినట్లు BCAS అధికారి ఒకరు తెలిపారు. తనిఖీలను చేసిన తర్వాత మాత్రమే కొబ్బరి కాయలను లోపలకి అనుమతిస్తారని చెప్పారు.


SAKSHITHA NEWS