SAKSHITHA NEWS

మానవత్వం చాటుకున్న గోనుపాడు ఎలక్ట్రిషన్ సురేందర్ ఎంఎస్ఎఫ్.

దగ్గరుండి సపర్యలు చేసి అంబులెన్స్ 108 కు సమాచారమిచ్చి గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించిన సురేందర్

సురేందర్ సేవలను చూసి అభినందించి ప్రశంసలు కురిపించిన గోనుపాడు గ్రామ ప్రజలు & మిత్రులు.

జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో సాయంత్రం గుర్తుతెలియని వృద్ధురాలు (60) సంవత్సరాలు,గోనుపాడు గ్రామంలో సాయంత్రం సమయంలో గుర్తు తెలియని వృద్ధురాలు రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో పడి ఉండడం చూసిన అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రిషన్ సురేందర్ ఎమ్ ఎస్ ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్పందించి వృద్ధ మహిళను లేపి జ్యుస్ ను తాగించి వెంటనే అంబులెన్స్ 108 కు సమాచారాన్ని ఇచ్చి గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. సంఘటన స్థలంలో గ్రామానికి చెందిన ప్రజలు సురేందర్ సేవలను చూసి అభినందనలు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిషన్ సురేందర్ మాట్లాడుతూ…. సాటి మనిషి ఆపదలో ఉన్న సమయంలో మన వంతుగా సహాయం చేయడంలో గొప్ప ఆనందం ఉందని అన్నారు.

ఈ సమాజంలో మనిషిని మనిషి ఆపదలో ఉన్న సమయంలో ఆదుకోలేనప్పుడు మనిషిగా బ్రతకడం వృధా అని అన్నారు. నిజమే కదా ! ఈ సమాజంలో మనిషి ప్రాణ ప్రాయస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కొంతవరకైనా ఆదుకుంటూ అండగా నిలవడం ఇలాంటి యువకులను మరి ఎంతోమంది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గుర్తుతెలియని వృద్ధురాలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని వారి బంధువులు కానీ తెలిసినవారు గానీ గద్వాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకొని సమాచారం తెలుసుకోవాలని సురేందర్ అభిప్రాయపడ్డారు.


SAKSHITHA NEWS