శ్రీశైలంలో ఘనంగా స్వర్ణ రథోత్సవం

Sakshitha news

శ్రీశైలంలో ఘనంగా స్వర్ణ రథోత్సవం

కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి కోటా రెడ్డి.

ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైలక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో శ్రీశైల దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆరుద్రోత్సవంలో భాగంగా తెల్లవారుజామున శివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా చేపట్టారు. ఉత్సవంలో భాగంగా కళాబృందాలు కోలాటం, తప్పెట నృత్యాలు లాంటి పలు జానపద కళారూపాలు నిర్వహించారు. రథోత్సవ వేడుకలో శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top