ఇండియన్ రెడ్ క్రాస్ లో ముందస్తు శ్రీరామనవమి వేడుకలు
…..
సాక్షిత : నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ ఎమ్మెస్సార్ స్పాస్టిక్స్ సెంటర్ నందు శ్రీరామనవమి సందర్భంగా ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా స్పాస్టిక్ సెంటర్ ను పూల అలంకరణను చేసి శ్రీరాముల వారి దేవుడి పటానికి దీపారాధన చేసి పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు స్పాస్టిక్స్ సెంటర్ కోఆర్డినేటర్ దాసరి రాజేంద్రప్రసాద్ శ్రీరామనవమి యొక్క విశిష్టత చిన్నారులకు వివరిస్తూ అందరికీ ఆదర్శం సీతారాముల వారి జీవితమని నిత్యం వారి దారిలో వారి స్మరణంలో మనందరు ముందుకు వెళ్ళాలని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ ప్రిన్సిపల్ ఎం. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ. చిన్నారులకు వారి తల్లిదండ్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ కూడా ఆ శ్రీరాముల వారి సీతమ్మల దయతో అన్ని శుభాలు జరగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పాస్టిక్ సెంటర్ చిన్నారులు వారి తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

