సవాయిగూడెంలో సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
*సాక్షిత వనపర్తి : దసరా దేవి నవరాత్రుల ను పురస్కరించుకొని వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో అమ్మవారు నవరూపాలలో భాగంగా ఏడవ రోజు న అమ్మవారు సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చారు గ్రామంలోని భక్తులు ఉదయం భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించి గ్రామ ప్రజలు వారి పిల్లలకు సరస్వతీ దేవి మండపంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు అనంతరం రామాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామకమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి శివకుమార్ రెడ్డి వర్ధన్న గౌడ్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు చిన్నారులు మహిళలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.