శబరిమల మండల పూజల వైభవం
కన్నుల పండువగా శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు
సాక్షిత కుత్బుల్లాపూర్:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శ్రీనివాస్ నగర్ (నిజాంపేట్) శబరిమల మండల దర్శనములు ప్రారంభమైన శుభ సందర్భంగా… నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ శ్రీ ధర్మ శాస్త్ర దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి కృపాకటాక్షంతో ప్రత్యేక భక్తి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని విశేష అలంకరణలతో అంబారి ఉత్సవం (అయ్యప్ప ఊరేగింపు) శ్రీనివాస్ నగర్ శ్రీ ధర్మ శాస్త్ర దేవాలయం ఛైర్మెన్ కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్, శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, సతీష్, మాజీ కార్పొరేటర్లు బొర్రా దేవి చందు ముదిరాజ్, ఆవుల పావని జగన్ యాదవ్, చిట్ల దివాకర్ పాటు అయ్యప్ప స్వామి భక్తులు నిర్వహించారు. ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి శరణు ఘోషతో అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారిని కీర్తించారు. అనంతరం బ్రహ్మశ్రీ నాగార్జున ఆచార్యుల(లాలు స్వామి) వారి కరకమలములచే ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించారు. నాగ మురళికృష్ణ పడి పూజ బాధ్యతలను అత్యంత నిష్టతో
నిర్వహించారు. ఈ భక్తి కార్యక్రమంలో నాయకులు, మాలధారణ స్వాములు, భక్తులు, పెద్ద సంఖ్యలో పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
