నాదెండ్ల,యడ్లపాడు మండలాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1.62 కోట్లు మంజూరు : ప్రత్తిపాటి
ప్రత్యేక విజ్ఞప్తిపై స్పందించి నియోజకవర్గంలోని పలు పాఠశాలల అభివృద్ధికీ నిధులు కేటాయించిన మంత్రి లోకేశ్..
“చిలకలూరిపేట మండలంతో పాటు, నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు,ల్యాబ్ లు, ప్రహరీల నిర్మాణం,కంప్యూటర్ రూముల ఏర్పాటుకుప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేసింది. మంత్రి లోకేశ్ గతంలో చేసిన విజ్ఞప్తిపై స్పందించి, కేంద్రప్రభుత్వ సహకారంతో చిలకలూరిపేట రూరల్,పట్టణ పరిథిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.2.10 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దానికికొనసాగింపుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల అభివృద్ధికి కూడా అదనంగా నిధులు కేటాయించారు. చిలకలూరిపేట మండలంతో పాటు ఇతర మండలాల్లోని పాఠశాలలకు కూడా నిధులు కేటాయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. తన అభిప్రాయాలు, సూచనలుపరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేశ్ నాదెండ్ల,యడ్లపాడు మండలాల పరిధిలోని, మౌలిక వసతులుఅవసరమైన కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు నేడు అదనంగా బిగ్స్ (బేసిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్) కార్యక్రమంలో భాగంగా మరో రూ.1.62 కోట్లు మంజూరు చేయిస్తున్నట్టు తెలియచేశారు. విద్యార్థులసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగిన వెంటనే పాఠశాలల అభివృద్ధికి కేంద్ర సహాకారానికి, రాష్ట్ర కేటాయింపులు జతచేసి నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజలు,ముఖ్యంగా విద్యార్థినీవిద్యార్థులు, ఉపాధ్యాయుల తరుపున మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.” అని మాజీమంత్రి ప్రత్తిపాటిమంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
