నల్ల పోచమ్మ తల్లిని దర్శించుకున్న కూన శ్రీనివాస్ గౌడ్

Sakshitha news

నల్ల పోచమ్మ తల్లిని దర్శించుకున్న కూన శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: చింతల్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో పునర్నిర్మించిన శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నల్ల పోచమ్మ తల్లి ఆశీస్సులు, దీవెనలు, కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.

అదేవిధంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు..

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీనివాస్ గౌడ్‌ కి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మల్లేష్, నరసింహారావుతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు ముత్యపాక నరసింహారావు, దాసరి వెంకటేష్, మేకల కుమార్, గోపాల్, పాండు తదితరులు పాల్గొన్నారు.