వైభవంగా నగర సంకీర్తన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మార్మోగుతున్నాయి.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. వందమందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో, నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తు నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండము నాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు, విక్రమ్ స్వామి, బ్రహ్మానందం, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర రెడ్డి, కోటి, ముని కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రెడ్డిబాబు, కల్పన పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
