మంచి ఆలోచనలకు విజయం తథ్యం
** కుప్పాల గిరిధర్ టీమ్ కు నగరి ఎమ్మెల్యే భరోసా
సాక్షిత ప్రతినిధి – నగరి / తిరుపతి: బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు నగరి ఎమ్మెల్యే గాలి బానుప్రకాష్ ను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడుతూ మీరు గత రెండు నెలలుగా రైల్వే డివిజన్ సాధన విషయంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు పత్రికల్లో చూస్తున్నాను అని తెలిపారు. మంచి ఆలోచనలతో మీరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మీ ప్రయత్నం నెరవేరాలని… తాను కూడ రాష్ట్ర నాయకులు, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డిని, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీలను కూడా కుప్పాల గిరి టీమ్ కలసి వారికి కూడా వినతిపత్రం ఇచ్చారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని, కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ కు, గజేంద్ర సింగ్ షేకావత్ కు, విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, సి.ఎం.రమేష్ దృష్టికి తీసుకెళతామని వివరించారు. అంతర్జాతీయ కార్గో టెర్మినల్ కొరకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డివిజన్ వస్తే ప్రస్తుతం తిరుపతి పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, మా నాన్న నెలవల సుబ్రహ్మణ్యం కూడ రైల్వేల విషయంగా అనేక ఉద్యమాలు చేసారని తిరుపతి డివిజన్ కొరకు అనేకపర్యాయాలు రాష్ట్ర, కేంద్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. మీ ప్రయత్నంకు నావంతు పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసారు. ఈకార్యక్రమంలో సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిదర్ కుమార్, ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎమ్.వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షులు వై.ఎస్.బాబు, సూరినేని బుజ్జి బాబు నాయుడు, పి.ఏ.పుష్పరాజ్, అనిల్, కుమార్ పాల్గొన్నారు.

