SAKSHITHA NEWS

బాల్యవివాహాల కారణంగా అమ్మాయిలు తమ లక్షాలను చేర్కోలేకపోతున్నారు………… అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్

*సాక్షిత వనపర్తి :
బాల్య వివాహాల కారణంగా అమ్మాయిలు తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిరోహించడంలో ఆటంకం ఏర్పడుతుందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో విద్యార్ధినులకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల మూలంగా అమ్మాయిలు తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిరోహించలేక పోతున్నరన్నారు. చిన్న వయసులో వివాహం చేసుకోవడం కారణంగా శరీరక వృద్ధి కోల్పోతారని, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. కాబట్టి బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అమ్మాయిలు సైతం బాల్య వివాహాలను వ్యతిరేకించాలని, ఎవరైనా అమ్మాయికి 18 ఏళ్ళు నిండకుండా వివాహం చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి తెస్తే 1098 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలన్నారు. అక్టోబర్ చివరి వారం చైల్డ్ మ్యారేజ్ ప్రెవేన్షన్ వీక్ గా పరిగనించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. 

కార్యక్రమంలో జిల్లా సంక్షేమధికారి లక్ష్మమ్మ, డీసీపీఓ రాంబాబు, సంక్షేమ శాఖ సిబ్బంది భాస్కర్, కళాశాల సిబ్బంది, విద్యార్ధినులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS