పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి : గిద్దె రాజేష్

Sakshitha news

పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి : గిద్దె రాజేష్

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళితే ఆయన ప్రభుత్వాన్ని పార్టీని బుర్కచర్ల నుంచే భూస్థాపితం చేసేలా ఉద్యమిస్తామని బుర్కచర్ల గ్రామ నూతన జెండా గద్దె ఆవిష్కరణ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తమ పోరాటం ఆగబోదని స్వస్టీకరణ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేలా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు సూర్యాపేట జిల్లా మోతే మండలం బుర్కచర్ల గ్రామంలో సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉప్పునూతల నరసయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన నూతన జెండా గద్దె ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి సంఘం నాయకులతో కలిసి తొలిత జెండా గద్దెను ఆవిష్కరించిన అనంతరం జెండాను ఎగరవేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరొకల ప్రవర్తిస్తూ తెలంగాణ రాష్ట్రంలో చాలీచాలని పింఛన్లతో అనేక సమస్యలతో అల్లాడిపోతూ దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు దురదృష్టకరమని ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుని హోదాలో తమ కాంగ్రెస్ పార్టీకి వికలాంగులు ఓటు వేస్తే తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల నుంచే వికలాంగుల పెన్షన్లను 6000 కు పెంచడంతోపాటు ఆర్టీసీలో వికలాంగులకు 100 శాతం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ ను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని ముఖ్యంగా రాజస్థాన్ చతిస్గడ్ రాష్ట్రాల్లో గతంలో తమ కాంగ్రెస్ పార్టీ హయాంలో వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన మాదిరిగానే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను వేయించుకొని వికలాంగుల ఓట్లతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి 20 నెలలు కావస్తున్న ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అడుగడుగున వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తున్న తీరు మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన తీరు మార్చుకొని ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడంతోపాటు పెన్షన్ 6000 కు పెంచి ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమించి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు 15 లక్షల రూపాయలతో ప్రతి వికలాంగుడ్ని ఆదుకునేలా వికలాంగుల బందు పథకాన్ని తీసుకువచ్చి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని లేకుంటే ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు విస్మరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన పోరాటానికి కొనసాగిస్తుందని తెలిపారు సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉప్పునూతల నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్ సంఘం మహిళా నాయకురాలు భాగ్యమ్మ సంఘం బురకచర్ల గ్రామ ఉపాధ్యక్షులు సురేష్ సంఘం నాయకురాలు వజ్రమ్మ సత్తిరెడ్డి ఆరూరి బాబు భువనగిరి భద్రయ్య రేణుక వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు