స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ప్రారంభించిన కొప్పుల వేణారెడ్డి
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని యండ్లపల్లి గ్రామంలో దండి అంతయ్య జ్ఞాపకార్థం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలు టోర్నమెంట్ మరియు సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి బౌషత్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దండి రమేష్, మండల ఎంఈఓ శేషగాని శ్రీనివాస్ గౌడ్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి , డీసీసీ ఉపాధ్యక్షుడు కుంట్ల వెంకట నాగిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ దాసరి తిరుమల్ రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి అంజద్ అలి, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ళ రమేష్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ మందాడి కిరణ్, ఎస్ఎంసి చైర్మన్ తాటిపముల లక్ష్మీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంచార్జ్ నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ట్రైనర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

