SAKSHITHA NEWS

మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేటలో గల గాంధీ విగ్రహం వద్ద మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా జాతి పిత ,బాపూజీ మహాత్మ గాంధీ 155 వ జయంతి వేడుకలలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , రాగం నాగేందర్ యాదవ్ , డీసీ మోహన్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ,గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ,జాతిపితకు ఘన నివాళ్లు అర్పించి ,గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియచేసి, పారిశుధ్య కార్మికులను సత్కరించి, మొక్కలు నాటిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అహింస దినోత్సవం కూడా అని పేర్కొనడం జరిగినది, అహింస ఆయుధంగా, సత్యం, ధర్మం, సైన్యంగా స్వాతంత్ర పోరాటానికి దిక్సూచి మహాత్ముడు అని ,వారి జీవనమే జాతికి సందేశం అని, ప్రతి పేదవాడి పెదాలపైన చిరునవ్వు చూడాలనే సంకల్పంతో వారి మార్గంలో పయనిస్తూ, వారి ఆశయాలను ఆదర్శాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు . ప్రతి ఒక్కరూ మహాత్ముడు చూపిన బాటలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. అహింస మార్గం లో గాంధేయమార్గం లో దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్ముడు  గాంధీ అని చెప్పడం జరిగినది  చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు , కులాలు ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత దేశం నుండి పారదోలి దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించిన మహానుభావుడు గాంధీ  అని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది  .ఈ రోజు స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే  అది ఆ మహాత్ముడి కృషి ఫలితమే అని సత్యాగ్రహం ,అహింస ,నిజాయితీ  వంటి మార్గాలను ఎంచుకొని అటువైపుగా ప్రజలను భాగస్వామ్యం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహోన్నత  వ్యక్తి మహాత్మా గాంధీ అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ  తెలియచేసారు. మహాత్ముడు చూపిన బాటలో అందరు నడవాలని,గాంధీ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలి అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ  పిలుపునివ్వడం జరిగినది . శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చు అని , ప్రతి ఒక్కరు మహాత్ముడి ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుంది అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు.

పారిశుధ్య కార్మికులను శాలవతో సత్కరించి, పూల మొక్కలు అందచేసి , మొక్కలు నాటడం జరిగినది ,ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, AMOH రవి కుమార్ , SRP కనకరాజు, SRP మహేష్ ,నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS