SAKSHITHA NEWS

గద్వాల సిగలో మరో నగను చేర్చిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాలకు కొత్త సమికృత కోర్టు సముదాయ భవనం మంజూరు

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న న్యాయదేవాలయ నిర్మాణనికి 81 కోట్ల నిధుల విడుదల

ముఖ్యమంత్రి కీ కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

హర్షం వ్యక్త పరచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

   గద్వాల జిల్లా కేంద్రంలో  సమికృత కోర్టు భవన నిర్మాణం కోసం 81 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది

ఈ సందర్బంగా  గద్వాల ఎమ్మెల్యే   బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  కి, జిల్లా మంత్రి  జూపల్లి కృష్ణారావు  కి, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు దామోదరా రాజానర్సింహా  కి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి  కోమటి రెడ్డి  వెంకటరెడ్డి  కి గద్వాల ప్రజల తరుపున ఎమ్మెల్యే  కృతజ్ఞతలు తెలిపారు.