
విజయవాడలో పూర్తిస్థాయి పాస్పోర్ట్ ఆఫీస్
AP: విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి పూర్తి స్థాయిలో సేవలందించనుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ కొత్త ఆఫీస్ను నేడు ప్రారంభించనున్నారు.
ఇన్నాళ్లూ పాస్పోర్టు ముద్రణ, జారీ కోసం వైజాగ్ పాస్పోర్ట్ ఆఫీస్కు పంపిస్తుండగా ఇకపై ఇక్కడే ముద్రించనున్నారు. దీంతో పాస్పోర్ట్ జారీ సమయం గణనీయంగా తగ్గనుంది. తప్పొప్పుల సవరణను కూడా ఇకపై 3 గంటల్లోనే పూర్తిచేయనున్నారు.
