డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసిన ఏకైక పార్టీ బిఆర్ఎస్: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
సాక్షిత : గృహ నిర్భంధం మధ్యే బాబాసాహెబ్ అంబేద్కర్ కు వారి నివాసంలో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కుత్బుల్లాపూర్ లోని వారి నివాస కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రసాదించిన మహా మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణే తమ ధ్యేయం అని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు రాజ్యాంగబద్దంగా నేడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను గృహ నిర్భంధం చేస్తూ రాజ్యాంగ పరిరక్షణకు తూట్లు పొడుస్తున్నది.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.