SAKSHITHA NEWS

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో గల కమ్యూనిటీ హాల్ లో ఉచిత టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సులు నిర్వహించడానికి తెలంగాణ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఆకుల లలిత ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ లలిత మాట్లాడుతూ మహిళలకు వారికి నచ్చిన పనుల్లో శిక్షణ ఇచ్చి స్వసక్తితో ఎదిగేలా చూసి వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు.

సంగారెడ్డి ప్రధాన రహదారిలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఆసక్తి అర్హత ఉన్న మహిళలకు ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలతో వివిధ రంగాలలో శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు అక్కడ జాయిన్ అవ్వొచ్చని సూచించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న ఆకుల లలిత కి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, ఎం.ఓ సుగుణ, డాక్టర్ ప్రియదర్శిని, మధులత, రాజ్యలక్ష్మి, నస్రీన్, సావిత్రి, స్వప్న, పద్మ, వరలక్ష్మి, రేణుక, సురేఖ, నాగరాణి, సుజాత, కావ్య, ఉమ, తులసి, సంధ్య, అజంతా, రమణమ్మ, ఎన్. పద్మ, గాయత్రి, వాలి నాగేశ్వరరావు, షకీల్ మున్నా, భిక్షపతి, ప్రవీణ్, స్వామి, దాసరి శ్రీనివాస్, సింహాచలం, సంతోష్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS