
డి.ఆర్.ఎన్.ఎస్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంపు.
చిలకలూరిపేట : స్థానిక డి.ఆర్ ఎం.ఎస్.సి.వి.ఎస్ కళాశాల లో తల సేమియా డే కేర్,విష్ణు డెంటల్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరా సుజాత తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విష్ణు డెంటల్ క్లినిక్ అధినేత డాక్టర్ బి రాజశేఖర్,తల సేమియా నీడ్స్ అధినేత బి.సాంబిరెడ్డి పాల్గొని క్యాంపు ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు 120 మందికి పైగా ఉచిత పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి ఉదయ ప్రకాష్,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది హాస్పటల్ సిబ్బంది బాబు,కోమలి పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app