బాపట్ల జిల్లా
ఉచిత కంటి వైద్య శిబిరము, బాపట్ల
వేగేశన ఫౌండేషన్, బాపట్ల వారి ఆధ్వర్యంలో , NRI జనరల్ హాస్పిటల్- చినకాకాని మరియు బాపట్ల జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో ఉచిత కంటి శుక్ల నిర్ధారణ శిబిరము నిర్వహించబడును. ఈ శిబిరము ఈనెల 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బాపట్లలోని టిడిపి ఆఫీస్ ప్రక్కన గల టౌన్ హాల్ నందు జరుగును. ఈ శిబిరం నందు కంటి పరీక్షలు చేసి ఉచిత కంటి శుక్లం ఆపరేషన్లు చేయుటకు ఎంపిక చేయబడును . కావున ప్రజలందరూ ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకో వలసిందిగా మనవి .
ఇట్లు ..
మీ.. వేగేశన నరేంద్ర వర్మ , చైర్మన్ – వేగేశన ఫౌండేషన్, బాపట్ల .
గమనిక :ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చువారు ఆధార్ కార్డు ఫోటో స్టాట్ తప్పనిసరిగా తీసుకురావలెను. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించవలెను.