చట్ పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు.
“సూర్యుడి కిరణాలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయాలని, సౌభాగ్యం మీ ఇంటిని నింపాలని ఈ చట్ పూజ సందర్భంగా శుభాకాంక్షలు.”
మనం జరుపుకుంటున్న చట్ పూజ అనేది సూర్య దేవుడిని ఆరాధించే పవిత్రమైన పండుగ . ఈ పండుగలో మనం ప్రకృతికి, సూర్యుడికి మరియు నీటికి కృతజ్ఞత తెలుపుతాము.
ఈ పండుగ మనకు సహజ వనరుల ప్రాధాన్యతను, శ్రమ మరియు భక్తిని గుర్తు చేస్తుంది. కుటుంబ సమగ్రత, శ్రద్ధ, మరియు విశ్వాసానికి ఇది ఒక చిహ్నం.
అందరికీ చట్ పూజ శుభాకాంక్షలు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సొంటిరెడ్డి చైతన్య, కమిటీ మరియు కాలనీ పెద్దలు , కాంగ్రెస్ నాయకులు , ప్రజలు పాల్గొన్నారు.
