మొంథా తుఫాన్ పై అప్రమత్తంగా ఉండండి…ఎమ్మెల్యే ఎంజీఆర్
సహాయక చర్యలపై డివిజనల్,జిల్లా స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే
మండల స్థాయి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
ఎటువంటి సంఘటనా జరగకుండా ముందస్తుగానే అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
పునరావాస కేంద్రాలలో భోజనాలు,మందులు,నిత్యవసర వస్తువులు సకాలంలో అందించాలని తెలియజేసిన ఎంజీఆర్
మొంథా తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు,అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు , తుఫానుపై ముందస్తుగా తన కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎటువంటి సంఘటన జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అలాగే పునరావస కేంద్రాల్లో సకాలంలో భోజనాలు,మందులు,నిత్యావసర సరుకులు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అలాగే ఎప్పటికప్పుడు డివిజనల్,జిల్లా స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సహాయక చర్యలు సకాలంలో అందేటట్లు చూడాలన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
