జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్?
హైదరాబాద్,
వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి,సీఎస్ సోమేశ్ కుమార్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆయనతోపాటు.. మరో ఇద్దరు ఉన్నతాధికారుల పైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. 70 కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపు ల్లో భారీగా అవకతవకలకు పాల్పడడమే కాకుండా.. ఐజీఎస్టీ కింద రూ.1000 కోట్ల మేర అక్రమంగా ఇన్ పుట్ క్రెడిట్ బదిలీ చేసినట్లు రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ విచారణలో తేలింది..
ఆ శాఖ కమిషనర్ కె.రవి మూడ్రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(డీడీ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 406, 409, 120బీ, ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో ఏ5గా సోమేశ్ కుమార్ ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన ప్లింటో టెక్నాలజీసను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు.
పంజాబ్ వ్యాపారి ఆ ఇన్వాయిసలను ఆధారంగా చేసుకుని 18ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను జీఎస్టీ కౌన్సిల్ ఖాతాల నుంచి క్లెయిమ్ చేశాడు. ఈ సొమ్మును పంజాబ్ డీలరు, తెలంగాణ డీలరు పంచు కున్నారు.
ఇలా తెలంగాణలోని పలువురు డీలర్లు, ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడబలుక్కుని సర్కారు ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ రూ.1000 కోట్లుగా ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు.